బ్రేకింగ్ : 13న తెలంగాణ అసెంబ్లీ, 14న మండలి సమావేశాలు

రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశం ఉంటుందని తెలిపింది. శాసన సభ ఉదయం 11:30 గంటలకు, మండలి ఉదయం 11గంటల నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. ఇక రేపు (శనివారం) సాయంత్రం కేబినేట్ సమావేశం జరగనుంది.

శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది.