వార్నర్ హాఫ్ సెంచరీల రికార్డ్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 132 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, తర్వాతి స్థానంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు 174 ఇన్నింగ్స్‌ల్లో 42 సార్లు 50కి పైగా పరుగులు తీశాడు.
తర్వాత మూడోస్థానంలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా 189 ఇన్నింగ్స్‌ల్లో 39 సార్లు ఈ ఘనత సాధించారు. తర్వాత నాలుగో స్థానంలో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ 147 ఇన్నింగ్స్‌ల్లో 38 సార్లు సాధించాడు.
ఇక దుబాయ్ వేదికగా గతరాత్రి పంజాబ్‌తో తలపడిన సందర్భంగా హైదరాబాద్ 69 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(52; 40 బంతుల్లో 5×4, 1×6), బెయిర్‌స్టో(97; 55 బంతుల్లో 7×4, 6×1) చెలరేగిపోయారు ఛేదనలో పంజాబ్ 132 పరుగులకే కుప్పకూలింది.