ఓటుకు నోటు కేసు రోజువారీ విచారణ.. చంద్రబాబు దొరికిపోతాడా ?

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులని సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టు, సీబీఐ కోర్టులు విచారణ షురూ చేశాయి. రోజువారీగా విచారణ చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా ‘ఓటుకు నోటు’ కేసుపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరిగింది.

తదుపరి విచారణని ఈ నెల 12కి వాయిదా వేసింది. ఈ కేశులో ఆడియో టేపుల ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు నిందితులుగా ఉన్న విషయం విదితమే. తెదేపా అధినేత చంద్రబాబు ఈ కేసులో ఉన్నాడనే ఆరోపణలున్నాయి. వీడియో టేపులో ఫోన్ లో మాట్లాడిన అవతలి వ్యక్తం చంద్రబాబునే అనే ఆరోపిస్తున్నారు.