ఏపీ ‘అన్ లాక్ 5.O’ గైడ్ లైన్స్ విడుదల
అన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి థియేటర్స్, స్కూల్స్.. అన్నీ తెరచుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం అన్ లాక్ 5 గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.
* మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి
* ఈ నెల 15 నుంచి స్కూల్స్, థియేటర్స్ కు అనుమతి
* సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి
* ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
* మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లో నో ఎంట్రీ
* సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించాలి
* స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాల వద్ద కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి
* విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలి.
* కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక అధికారి
* బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం
* ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి