దర్శకధీరుడా.. మా శుభాకాంక్షలు అందుకో !

‘తెలుగు సినిమా’తో చాలా మంది ఎదిగారు. స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు.. అనిపించుకున్నారు. అయితే కొంతమంది మాత్రమే ‘తెలుగు సినిమా’ ఎదిగేలా చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. వారిలో దర్శకధీరుడు రాజమౌళి ముఖ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జక్కన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ https://www.tsmirchi.com/te.

‘స్టూడెంట్  నెం.1’తో సినిమా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి. అంతకుముందు ఆయన సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా టైటిల్ ‘స్టూడెంట్ నెం.1’.. ఆయన టాలీవుడ్ లో ఎప్పుడూ నెం. 1 దర్శకుడే. ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి సినిమాలు చేశారు. చేసినవన్నీ బ్లాక్ బస్టర్ హిట్టే. ఎమోషన్స్ బలంగా చూపడమే జక్కన్న ప్రత్యేకత. బాహుబలి విజయానికి అదే కారణమని చెబుతుంటారు.

జక్కన్న పూర్తి పేరు ‘ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి’. 1973 అక్టోబర్ 10న జన్మించారు. ఈరోజుతో47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి పెంచారు. ఇప్పుడు తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. అంటే దానికి జక్కన్ననే కారణం. ప్రస్తుతం ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తెరకెక్కించేలా ఆయనకి భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ.. దర్శకధీరుడా.. మా శుభాకాంక్షలు కూడా అందుకో.. అంటోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.