ఐపీఎల్ : గెలుపు ముగింట బోల్తాపడ్ద పంజాబ్
శని, ఆదివారాల్లో క్రికెట్ ప్రేక్షకులకి డబుల్ దమాఖా అన్న సంగతి తెలిసిందే. రెండు మ్యాచులు జరుగుతాయి. ఈ మధ్యాహ్నం కోల్ కతా-పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో పంజాప్ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ (58; 29 బంతుల్లో, 8×4, 2×6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. మోర్గాన్ (24; 23 బంతుల్లో, 2×4, 1×6), శుభ్‌మన్ గిల్ (57; 47 బంతుల్లో, 4×5) జట్టుని ఆదుకున్నారు. కోల్‌కతా.. ఆఖరి 7 ఓవర్లలో 89 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఈజీగా గెలిచినట్టే అనిపించింది. ఆఖరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 20 పరుగులు మాత్రమే అవసరం. ఇంకా చేతిలో 8 వికెట్లున్నాయి. కెప్టెన్ కె ఎల్ రాహుల్ (74) క్రీజులో ఉన్నారు. అయితే ఆఖరి 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన కోల్ కతా బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఆఖరి ఓవర్ లో 14 పరుగుల అవసరం ఉండగా క్రీజులో మాక్స్ వెల్ ఉన్నా.. ఏమీ చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో కోల్ కతా గెలుపొందింది.