కోహ్లీ ఈజ్ బ్యాక్.. ఇక బెంగళూరుకు ఎదురేలేదు !
బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ అభిమానులకి గుడ్ న్యూస్. కెప్టెన్ విరాట్ కోహ్లీ టచ్ లోకి వచ్చేశాడు. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీలోని పరుగుల రారాజు బయటకు వచ్చాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. కోహ్లీ (90*; 52 బంతుల్లో 4×4, 4×6) వీరబాదుడు వల్లే బెంగళూరు 169 స్కోరు చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ మొదట్లో చప్పగా సాగింది. జట్టు స్కోరు 13 వద్దే ఫించ్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేయడంతో కోహ్లీ, దేవదత్ కేవలం సింగిల్స్‌కే పరిమితం అయ్యారు. దాంతో 10 ఓవర్లకు కోహ్లీసేన 65/1తో నిలిచింది. ఈ క్రమంలో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లీ.. ఆఖరి ఓవర్లలో మాత్రం విరుచుకుపడ్డాడు. మునుపటి కోహ్లీ కనిపించారు. దీంతో.. ఇక బెంగళూరుకి ఎదురేలేదని ఆ జట్టు అభిమానులు చెప్పుకొంటున్నారు.
ఇక . 170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 132/8కే పరిమితమైంది. ఏకంగా 37 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అంబటి రాయుడు (42; 40 బంతుల్లో 4×4), జగదీశన్ (33; 28 బంతుల్లో 4×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. ధోని వచ్చిరాగానే ఓ సిక్స్ బాది..టచ్ లోకి వచ్చినట్టు కనిపించాడు. ఇంతలో మరో భారీ షాట్ కి ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు.