రష్మీపై ప్రేమని బయటపెట్టిన సుధీర్
సుడిగాలి సుధీర్ – రష్మి ప్రేమ పక్షలు అనే ప్రచారం చాన్నాళ్ల నుంచి ఉంది. అయితే తమ మధ్య ఏమీ లేదు. మేం మంచి
స్నేహితులం మాత్రమేనని రష్మీ, సుధీర్ పలు మార్లు చెప్పినా.. వీరిపై ప్రచారం ఆగడం లేదు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసి.. వీరు ప్రేమికులం. వీరి మధ్య ఏదో నడుస్తోందని చెప్పుకొంటున్నారు. అయితే ఎట్టకేలకు సుధీర్ బాబు ఓపెన్ అయ్యాడు. రష్మీపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. ఎక్స్ ట్రా జబర్థస్త్ షో 300ఏపీసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘సుధీర్ అంటే కొంతమంది గుర్తుపట్టొచ్చు. కానీ సుధీర్-రష్మి అంటే మొత్తం గుర్తుపడతారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. కానీ ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనుక కాదు నా పక్కనే ఉంది.’ అని చెబుతాడు. అయితే ఇది ప్రోమో మాత్రం ఈ ఏపీసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. రష్మీ గురించి సుధీర్ చెప్పిన పూర్తి మాటలు వినాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.