హాథ్రస్ ఘటన : సీబీఐ విచారణ ప్రారంభం

దేశంలో సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఈ ఘటనపై చాంద్‌పా పోలీసు స్టేషన్లో బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే. సెప్టెంబరు 14న తన సోదరిని నలుగురు వ్యక్తులు అత్యాచారం ఆపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుని సీబీఐ కి అప్పగిస్తూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా సీబీఐ విచారణని మొదలెట్టింది.