అలర్ట్ : తెలంగాణకు భారీ వర్షం సూచన

రాబోయే 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. . ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వెల్లడించింది. తీవ్ర వాయుగుండం నర్సాపురం-విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.  సోమవారం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.