రోజర్ ఫెదరర్.. ఛాంపియన్!
రోజర్ ఫెదరర్ తన జోరు మరోసారి చూపించారు. ఫలింతంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు. మ్యాచ్ ఐదు సెట్ల పాటు సాగినా.. మూడు గంటలు నడిచినా.. ఫైనల్లో రోజర్ ఆటే హైలైట్. ఈ స్విస్ స్టార్ 6-2, 6-7 (5-7), 6-3, 3-6, 6-1తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు.
గతేడాది ఇదే సిలిచ్ను ఓడించి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న ఫెదరర్.. ఈసారీ అదే జోరు ప్రదర్శించాడు. కానీ అప్పుడు సిలిచ్ సులభంగా లొంగితే.. ఈసారి గట్టిగానే పోరాడాడు. తన బలమైన రిటర్న్లు, మెరుపు సర్వీసులతో బాగా ఇబ్బందిపెట్టాడు. ఒకవైపు 38 డిగ్రీల ఎండ.. మరోవైపు సిలిచ్ పోరాటం.. అయినా ఫెదరర్ తగ్గలేదు. ఐదు సెట్ల పటు సాగిన ఆటలో విజేత నిలిచాడు. 36 ఏళ్ల వయసులో 20వ గ్రాండ్ స్లామ్ ని ఖాతాలో వేసుకొన్నాడు.