కోల్‌కతాపై కోహ్లీసేన ఘన విజయం
ఐపీఎల్ లో భాగంగా నిన్న షార్జా వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రెండు వికెట్లకు 194 పరుగులు చేసింది. డివిలియర్స్ (73*; 33 బంతుల్లో, 5×4, 6×6) విధ్వంసం సృష్టించాడు. పడిక్కల్ (32; 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్ (47; 37 బంతుల్లో, 4×4, 1×6) దూకుడుగా ఆడారు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ (33*; 28 బంతుల్లో, 1×4) 19వ ఓవర్లో తన తొలి బౌండరీ బాదాడు. చివరి అయిదు ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 112 పరుగుల కే పరిమితమైంది. గిల్ (34; 25 బంతుల్లో, 3×4, 1×6), రసెల్ (16; 10 బంతులు, 2×4, 1×6), మోర్గాన్ (8; 12 బంతుల్లో, 1×4), దినేశ్ కార్తిక్ (1; 3 బంతుల్లో), త్రిపాఠి (16; 22 బంతుల్లో, 1×4), కమిన్స్ (1), నాగర్కోటి (4), చక్రవర్తి (7*), ప్రసిధ్ కృష్ణ (2*) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను నియంత్రించారు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కోహ్లీసేనకు ఇది అయిదో విజయం.