జైల్లో కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ భూ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ 1.6కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో నాగరాజు ఉంటున్నాడు. జైల్లోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
నాగరాజు ఆత్మహత్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే అధికారులు ఏం చేశారు ? అన్నది ప్రశ్నగా మారింది. ఆయన ఆత్మహత్య వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా ? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ కేసులో అరెస్టైన అంజిరెడ్డి, తదితరులకు ఇటీవల కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.