మెగా ‘సైరా’కు బిగ్ షాక్ ?
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు బిగ్ షాక్ తగిలినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఇప్పటికే “సైరా నర్సింహారెడ్డి” హైదరాబాద్’లో ఫస్ట్ షెడ్యూల్’ని పూర్తి చేసుకొంది. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనుంది. ఇంతలో ‘సైరా’కు సడెన్ షాక్ తగిలినట్టు చెప్పుకొంటున్నారు. సినిమాలో కీలక పాత్రలో నటించనున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా ‘సైరా’ నుండి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ? అనేది తేలాల్సి ఉంది.
సైరా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఒకట్రెండు షాకులు తగిలాయి. సంగీత దర్శకుడిగా ప్రకటించిన ఏ ఆర్ రెహమాన్ తప్పుకొన్నారు. సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ రెహమాన్ బాటలోనే వెళ్లారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కి ముందు బిగ్ బీ బిగ్ షాక్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. సైరాకు గట్టి దెబ్బ తగిలినట్టే.. !
మరోవైపు, ఈ వార్తలని మెగా కాంపౌండ్ కొట్టిపారేస్తోంది. ఫిబ్రవరిలో కేరళ షెడ్యూల్ కోసం సైరా టీం రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ లో బిగ్ బీ అమితాబ్ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే బిగ్ బీ నుంచి రిప్లై కూడా వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. సైరాకు బిగ్ షాక్ వార్తల్లో నిజమెంత ? అనేది వారం రోజుల్లో క్లారిటీ రానుంది.