ఎంత పని చేశావ్ బిట్టు !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఐదు వారాలని పూర్తి చేసుకుంది. ఐదో వారం సుజాత ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేట్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమెది ఫేక్ నవ్వు అని ప్రేక్షకులు ఫీలయ్యారు. రెండోది హోస్ట్ నాగార్జునని బిట్టు అని పిలవడం ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే సుజాతకి ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చిన సుజాత వాస్తవాలు తెలుసుకొని షాక్ తిన్నదట. అంతేకాదు.. తాను కావాలని నాగ్ ని బిట్టు అని పిలవలేదు. ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటూ బాంబు పేల్చింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుజాత ‘నాగార్జున అంటే ఇష్టమా అని బిగ్బాస్ టీం నన్ను అడిగింది. ఇష్టమే అని చెప్పడంతో పాటు ఆయన చేసిన ‘మనం’ సినిమా, బిట్టు పాత్ర మరీ మరీ ఇష్టమని చెప్పాను. దీంతో బిట్టు అని పిలవడానికి నీకు ఇష్టమేనా అని అడిగారు. అందుకు సరేనన్నాను. నేను అలా పిలిచినప్పుడు కూడా నాగార్జున సర్ చాలా సంతోషపడ్డారు. బిట్టు అని పిలవడం ఆయన అభిమానులకు బాధ కలిగించి ఉంటే క్షమించాలని, తాను కావాలని మాత్రం పిలవలేదు’ అని సుజాత వివరణ ఇచ్చుకున్నారు.