అలర్ట్ : తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లకండి
కరోనా లాక్‌డౌన్ తో ఆర్నెళ్ల పాటు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే అన్ లాక్ 5.0 లో భాగంగా థియేటర్స్ ఓపెనింగ్ కి కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో ఈరోజు సినిమా పరిశ్రమకు, సినీ ప్రేమికులకి పండగే. కానీ ఆ వాతావరణం కనబడటం లేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకోవడం లేదు.
ఏపీ ప్రభుత్వం థియేటర్స్ తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని ధియేటర్ యజమానులు కోరుతున్నారు. గతంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు.. విద్యుత్ బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు ఇంకా రాలేడు. వాటి కోసమే థియేటర్స్ యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ కనీస చార్జీలు ఒక్కో థియేటర్‌కు రూ. 4 లక్షల వరకు బిల్లు వచ్చింది. దీన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి థియేటర్స్ ఓపెనింగ్ కి ఇంకా అనుమతులు వచ్చినట్టు లేదు. ఇక్కడ కూడా అనుమతులు వచ్చినా థియేటర్స్ తెరవడానికి యాజమాన్యాలు రెడీగా లేవ్. అందుకే.. కేంద్రం అనుమతి ఇచ్చిందని ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లకండని చెబుతున్నాం.