వివేకా కేసు.. సీబీఐ కొత్త టీమ్ !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని ఏడుగురు సభ్యులకి కరోనా సోకింది. దీంతో ఈ కేసు దర్యాప్తుకి బ్రేకులు పడ్డాయి. అయితే దర్యాప్తు ఎక్కడా ఆగకుండా సీబీఐ కొత్త బృందాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. వివేకా హత్య కేసు దర్యాప్తు జెడ్ స్పీడుతో జరగనుంది.

గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. చంద్రబాబే ఆ హత్యను చేయించారని ఆరోపించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని వాదించారు. అయితే.. వైఎస్ వివేకా కుమార్తె మాత్రం.. తన అన్న పాలనలో న్యాయం జరగడం లేదని.. సీబీఐ విచారణ కావాల్సిందేనని హైకోర్టుకు తెలిపింది. పోలీసులు ఈ కేసులో నిందితుల్ని తేల్చలేకపోతూండటంతో.. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.