సోలో బతుకు బ్రేకప్ సాంగ్ వచ్చేసింది 

కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘సోలో బతుకే సో బెటర్’. నభా నటషా హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ ని విడుదల చేశారు. ‘వగ్గేసి పోకే అమృత..నన్ను ఒగ్గేసి పోకే అమృత’ అంటూ సాగిన ఈ సాంగ్ అదిరిపోయింది. వైజాగ్ బీచ్ రోడ్ లో యంగ్ టీమ్ తో ఈ పాటను పిక్చరైజ్ చేసారు. క్యాసర్ల శ్యామ్ రాసిన క్రేజీ లిరిక్స్ కు థమన్ మాంచి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ అందించారు.

కరోనా నేపథ్యంలో సోలో బతుకే సో బెటరు సినిమా నేరుగా ఓటిటిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ వున్నాయి.  జీఫ్లెక్స్, జీటీవీ, జీఫైవ్ ల్లో ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే థియేటర్స్ కూడా తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో.. చిత్రబృందం థియేటర్ రిలీజ్ కి మొగ్గు చూపవచ్చు. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.