తెలంగాణ కరోనా రిపోర్ట్ : 1,554 కేసులు, 1,435 రికవరీ

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,554 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ 7 మంది మృతిచెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1256కి చేరింది.

కరోనా బారి నుంచి 1435 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,4653కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులుండగా.. 19,251 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.