కవితక్క బతుకమ్మ సందేశం
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. దసరాకు ముందు వచ్చే అమావాస్యరోజు ప్రారంభమయ్యే బతుకమ్మ బందరాలు దసరావరకు కొనసాగనున్నాయి.. తొమ్మిదిరోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ నోటు షేర్ చేశారు.
ఇక ఈరోజు నుంచి మొదలు కానున్న దసరా సంబరాలు తొమ్మిదిరోజుల పాటు కొనసాగుతున్నాయ్. ఈ తొమ్మిది రోజులు ఏం జరుగుతుందటే..
1. ఎంగిలి పూల బతుకమ్మ : మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్తరమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేథ్యం చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేథ్యం.
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేథ్యం తయారు చేసి సమర్పిస్తారు.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేథ్యం.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేథ్యంగా తయారుచేసి సమర్పిస్తారు.
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేథ్యమేమి సమర్పించరు.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేధ్యం చేస్తారు.
8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేథ్యం తయారు చేస్తారు.
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేథ్యాల తయారు చేస్తారు. పెరుగన్నం,
చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం లాంటివి చేసి సమర్పిస్తారు.
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా..
ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020