గులాం నబీ ఆజాద్’కు కరోనా పాజిటివ్
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆజాద్ ట్విట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ఇప్పటికే ఉపరాష్ట్రపతి, కొందరు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వీరిలో చాలా మంది కోలుకున్నారు. అయితే కొందరు మాత్రం కరోనా పోరాటం లో ఓడిపోయారు. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 63వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.. అయితే కరోనా కేసులు పెరిగినా. రికవరీ రెటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ఇక వచ్చే యేడాది జనవరిలోగా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రభుత్వం అంచనా వేస్తోంది.
I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol.
— Ghulam Nabi Azad (@ghulamnazad) October 16, 2020