మెగా స్టూడియో ప్రకటన ఎప్పుడంటే ?
మెగాస్టార్ చిరంజీవికి ఓ తీరని కోరిక ఉంది. అదే ఓ అద్భుతమైన సినిమా స్టూడియోని నిర్మించాలి. ఇప్పుడీ కోరికని చిరు తీర్చుకోబోతున్నాడు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ బ్రహ్మండమైన స్టూడియోను నిర్మించాడానికి పూనుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 10ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై మెగాస్టార్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. బహుశా.. దసరా రోజున మెగా స్టూడియోపై ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు. సినిమా షూటింగ్స్, రియాలిటీ షోలకు అనువుగా ఉండేలా సకల సౌకర్యాలతో ఈ స్టూడియో ఉండబోతుందని తెలుస్తోంది.
మరోవైపు, ఇప్పటికే అల్లు అరవింద్ గండిపేట్ ప్రాంతంలో భారీ స్టూడియో నిర్మాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడ పదెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం కానుందట. ఈ స్టూడియోను అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మిస్తున్నట్లుగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బహుశా.. బావ-బామ్మర్థులు బదురుకొని స్టూడియోల నిర్మాణాలు చేపడుతున్నట్టు అనిపిస్తోంది.