హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్ టై
ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా-హైదరాబాద్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టై అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. చేధనలో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్లు కోల్పోయి సరిగా 163 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితంగా సూపర్ ఓవర్ కి దారితీసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(36; 37 బంతుల్లో 5×4), రాహుల్ త్రిపాఠి(23; 16 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. ఆఖరులో ఇయాన్ మోర్గాన్(32; 21 బంతుల్లో 3×4 1×6), దినేశ్ కార్తీక్(29; 14 బంతుల్లో 2×4, 2×6) జట్టు స్కోరును 160 దాటించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బాసిల్ థంపి తలా ఒక వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ వార్నర్ 47, బెన్ స్టో 36, అబ్దుల్ సమద్ 23, విలియమ్ సన్ 29 పరుగులు చేశారు.