గుడ్ న్యూస్ : అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణ

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 948 కొత్త కేసులు నమోదయ్యాయ్. చాలారోజుల తర్వాత వెయ్యిలోపు కొత్త కేసులు నమోదుకావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండటంతో మరో నెలరోజుల్లోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడొచ్చని చెబుతున్నారు.

కరోనాతో నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టికవ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ పేర్కొంది. వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి తాజాగా మరో 1,896 మంది బాధితులు కోలుకోగా..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,00,686కి చేరింది.