సన్ రైజర్స్ సూపర్.. ఫ్లాప్ !

ఐపీఎల్ లో హైదరాబాద్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. చేధనలో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 6 వికెట్లు కోల్పోయి సరిగా 163 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితంగా సూపర్ ఓవర్ కి దారితీసింది.

ఆ ఓవర్‌లో హైదరాబాద్‌ కేవలం 2 పరుగులే చేసింది. సులువైన లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను రషీద్‌ఖాన్‌ కాస్త ఇబ్బంది పెట్టాడు. కానీ.. ఓటమిని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ మూడు విజయాలు, 6 ఓటములతో ఉంది. మ్యాచ్‌ ఓడినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న వార్నర్‌సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే కొనసాగుతోంది.