‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ప్రీ-టీజర్ వచ్చేసింది !


అఖిల్ అక్కినేని నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. గీతాఆర్ట్స్ 2 నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ని విడుదల చేశారు. ‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు అలరిస్తోంది. ‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే… అయ్యయ్యయ్యయ్యో..’ అని చెబుతూ ఊగిపోయాడు. ఆ కన్ఫూజన్ వెనక కారణమేంటీ ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ ని దసరా కానుకగా ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఇక అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు తొలి హిట్ పడలేదు. ఆయన తొలి చిత్రం ‘అఖిల్’ అట్టర్ ప్లాప్ కాగా, హలో, మిస్టర్ మజ్ఝ్ను సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయ్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమాతో హిట్ కొట్టి…  కెరీర్ ని ఊపుమీదకు తీసుకురావాలని అఖిల్ ఆశపడుతున్నారు. మరీ.. ఆయన ఆశలు నెరవేరుతాయానా ? అన్నది చూడాలి.