బిగ్ బాస్ : కుమార్ సాయి.. ది మోస్ట్ ఎనర్జిటిక్ ఎలిమినేటర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఆరోవారాలని పూర్తి చేసుకుంది. ఆరోవారం బిగ్ బాస్ ఇంటి నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. అంతకుముందు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగ్ ఉడికించారు. మోనాల్, కుమార్ సాయి.. ఇద్దరినీ బ్యాగులు సర్థుకొని కన్ఫెన్షన్ రూమ్ కి పిలిచారు. ఆ తర్వాత మోనల్ ని అక్కడే ఉంచి కుమార్ సాయిని బయటికి పిలిచారు. అయితే బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతున్న బాధ కించ్చిత్తు కూడా కుమార్ సాయిలో కనిపించలేదు. ఆయన హ్యాపీగా బయటికొచ్చారు. బహుశా.. ఇన్ని వారాలు ఉండటమే ఎక్కువ అనుకున్నారేమో.. !

మరోవైపు మొదట్లో కాస్త డల్ గా కనిపించిన  కుమార్ సాయి.. ఇటీవల హుషార్ అయ్యారు. టాస్క్ లలో బాగా పార్టీసీపేట్ చేస్తున్నారు. దీంతో ఈ వారం మోనాల్ ఎలిమినే అవుతుందని అందరు అనుకున్నారు. సోషల్ మీడియా కూడా అదే కూసింది. కానీ బిగ్ బాస్ కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు. ఈ ఎలిమినేషన్ వచ్చిన ఓట్ల ఆధారంగా జరగలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కుమార్ సాయి కంటే తక్కువ ఓట్లు వచ్చిన మోనాల్ ఎలిమినేట్ చేయలేదని చెప్పుకొంటున్నారు. మోనాల్ ఉంటే బిగ్ బాస్ ఇళ్లు కలర్ ఫుల్లుగా ఉంటుందని ఇలా చేశారేమో.. !