800 నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథగా ‘800’ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిలోనే ఈ బయోపిక్ పై వివాదాలు మొదలయ్యాయ్. మురళీధరన్ తమిళుల వ్యతిరేకి. శ్రీలంకలో తమిళులపై జరిగిన మారణకాండపై ఆయన ఎప్పుడు స్పందించలేదు. పైగా తమిళులకి వ్యతిరేకంగానే ఆయన వ్యవహరించారు. అలాంటి వ్యక్తి జీవిథకథలో విజయ్ సేతుపతి నటించడం ఏంటీ ? అని ప్రశ్నించారు.
ప్రేక్షకులు మాత్రమే కాదు. సినీ ప్రముఖులు విజయ్ సేతుపతిని తమిళుల ద్రోహీగా అభివణించారు. ఈ వివాదంపై మురళీధరన్ స్పందించారు. తాను తమిళుల వ్యతిరేకిని కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో మురళీధరన్ మరోసారి స్పందించారు. తన బయోపిక్ నుంచి మురళీధరన్ తప్పుకోవాల్సిందిగా విజ్ఝప్తి చేశారు. నా వల్ల విజయ్ సేతుపతి ఇబ్బంది పడకూడదు. ఈ సినిమా చేయడం వల్ల విజయ్ సేతుపతి ఫిల్మ్ కెరీర్ కు హాని జరుగుతుందని, అందువల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతిని కోరాడు.
చిత్ర నిర్మాతలు ఈ పాత్రను త్వరలోనే మళ్లీ తిరిగి పొందుతారని, బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మురళీధరన్. మురళీధరన్ విజ్ఞప్తికి స్పందించిన విజయ్ సేతుపతి ధన్యవాదాలు, వీడ్కోలు అని రీట్వీట్ చేశాడు. దీంతో 800 నుంచి విజయ్ సేతుపతి అధికారికంగా తప్పుకున్నట్టయింది.
நன்றி.. வணக்கம் 🙏🏻 pic.twitter.com/PMCPBDEgAC
— VijaySethupathi (@VijaySethuOffl) October 19, 2020