నాయినికి కేటీఆర్ పరామర్శ
తెలంగాణ ఉద్యమనేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన అరోగ్యం విషయంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నాయిని పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
ఇటీవల నాయిని కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కసారిగా ఆయనకి ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో.. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నాయిని త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, తెరాస శ్రేణులు కోరుకుంటున్నారు.
అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహా రెడ్డి గారిని పరామర్శించిన మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/O6vqrmRtxH
— KTR News (@KTR_News) October 19, 2020