హైదరాబాద్ ‘భారీ వర్షాలు-వరదలు కాంగ్రెస్ ఖాతా’లోనే.. !!


భారీ వర్షాలు-వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. పలు కాలనీలో నీట మునిగాయి. వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. మరికొందరు ఆచూకీ తెలియాల్సి ఉంది. దాదాపు రూ. 5వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఈ వరదలు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి తలసాని తనదైన శైలిలో స్పందించారు. 2014 ముందు నిర్మించిన ప్రాంతాల్లోనే వరదలు సంభవించాయి. గత పాలకులు వ్యవహరించిన తీరు వల్లే హైదరాబాద్‌కు ఈ దుస్థితి దాపురించిందని తలసాని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వరదలు, దాని వలన కలిగిన డ్యామేజ్ ని కాంగ్రెస్ ఖాతాలోనే వేశారు తలసాని. మరీ.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు ? అన్నది చూడాలి. మరోవైపు వరదల్లో చిక్కుకున్న ఒక్కో కుటుంబానికి రూ. 10వేల ఆర్థికసాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. వాటిని తక్షణమే వారికి అందిస్తామని తెలిపారు.