ఎంపీ గల్లా జ‌య‌దేవ్ కు అరుదైన గౌరవం..

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ప్రపంచ స్దాయి లో అరుదైన గౌరవం దక్కింది. సీఎం చంద్రబాబు తోపాటు ఏపి ప్రభుత్వ బృందం పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన కు వెళ్ళిన ఆయ‌న‌, ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌పంచ ఆర్తిక స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ సదస్సు లో గల్లా జయదేవ్ కు గా ఎలక్ట్రసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్ గాను , గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్ గా నియమించారట‌.

అమర రాజా గ్రూపు తో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారంలో అనుభవం గడించిన గల్లా జయదేవ్ ఈ పదవికి సమర్దుడని గ్రహించిన ప్రపంచ ఆర్దిక సదస్సు గల్లా ను ఎలక్ట్రసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్ గాను మరియు , గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్ గా నియమించింది. దావోస్ లో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఆర్దిక సదస్సు లో ఈ మేరకు గల్లా జయదేవ్ కు ఈ పదవులు కట్టబెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ప్రపంచ ఆర్దిక సదస్సు లు జరిగినా గల్లా జయదేవ్ ఈ హోదా లో పాల్గోనే అవకాశం ఉంటుంది. ప్రపంచం లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకం ఎక్కువైందని, వాటి నుంచి ఈ వేస్ట్ చాలా ఎక్కువ గా వస్తుందని గ‌ల్లా జ‌య‌దేవ్ అన్నారు. ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని, ప్రస్తుతం 15 శాతమే ఈ రీసైక్లింగ్ జరుగుతుందని ఆయ‌న తెలిపారు.

పూర్తి స్థాయి లో రీసైక్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని గల్లా సదస్సు లో వివరించారు. ఈ వేస్ట్ మానవాలికి అడ్డంకిగా మారకుండా రీసైక్లింగ్ తో ఈ వేస్ట్ ను వాడుకలోకి తెచ్చుకోవచ్చని చెప్పారు. తనకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ప్రపంచ స్థాయి లో అత్యున్నత గౌరవం దక్కడం పై ఆయన అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.