బిగ్ బాస్ : ఏడోవారం ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చింది.. వీరే !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏడోవారానికి సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇంటి సభ్యులని జంటలుగా విడదీసిన బిగ్ బాస్.. ఇద్దరు మాట్లాడుకొని ఒకరు ఎలిమినేట్ కావాలని సూచించారు. అఖిల్-మోనాల్, సోహెల్-అవినాష్, లాస్య-దివి, హారిక-అభిజిత్, అరియానా-మెహబూబ్ జంటలుగా ఏర్పాటు చేశారు.

వీరిలో మోనాల్, అవినాష్, దివి, అభిజిత్, అరియానా ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చేశారు. త్యాగల ప్రాతిపదికన ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. మరీ.. వీరిలో ఈ వారం ఎవరు బయటికి వెళ్తారు అన్నది చూడాలి. ఇక బిగ్ బాస్ నుంచి తొలి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాల్గోవారం స్వాతి దీక్షిత్, ఐదో వారం సుజాత, ఆరోవారం కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక గంగవ్వ అనారోగ్యంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.