హారిక మరో మోనాల్.. అతడితో ఫుల్లుగా ప్రేమలో !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. అనడం కంటే రొమాంటిక్ గా టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. అభిజిజ్-మోనాల్-అఖిల్ మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడిచింది. అది కాస్త బ్రేకప్ అయింది. మోనాల్ ని అభిజిత్ పక్కనపెట్టి చాన్నాళ్లవుతుంది. కనీసం ఆమెతో మాట్లాడటం కూడా లేదు. దీంతో అఖిల్ తో మోనాల్ సెటిలైయింది. మూడొచ్చినప్పుడల్లా అఖిల్ కి హగ్ లు ఇస్తుంటుంది. ఇక మొదటి నుంచి అభిజిత్-హారిక మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. సోమవారం ఏపీసోడ్ తో అది మరో లెవల్ కి చేరుకుంది.
నిన్న ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 10 మందిని జంటలుగా విడిపోయి స్టాండ్ దగ్గర ఉండి ఎవరినో ఒకరిని మీరే నామినేట్ చేసుకోవాలని.. తుది నిర్ణయం మీదే అంటూ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక అందులో హారిక అబిజిత్ జంటగా ఉండడం ఆకట్టుకుంది. ఫైనల్ గా అభిజిత్ మొత్తానికి హారిక కోసం త్యాగం చేయక తప్పలేదు. అయితే హారిక మాత్రం బాగా ఎమోషనల్ అయింది. అన్ ఫెయిర్ అంటూ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చింది. ఇక నామినేషన్స్ అనంతరం అమ్మా రాజశేఖర్ తో హారిక మాట్లాడుతూ.. బిగ్ బాస్ నాకు ఫ్యామిలీ కావాలా? అభిజిత్ కావాలా? అనే విధంగా ఇబ్బందుల్లోకు నెట్టేశాడంటూ చెప్పుకొచ్చింది. దీంతో. ఆమె అభిజిత్ డీప్ గా వెళ్లినట్టు కనిపిస్తొంది. బిగ్ బాస్ షో పూర్తయ్యేలోపు.. వీరిద్దరు జంటగానే బయటికొచ్చేలా కనిపిస్తున్నారు.