హైదరాబాద్’లో దంచికొడుతున్న వర్షం
వాన దేవుడు హైదరాబాద్ పై పగబట్టినట్టున్నాడు. టార్గెట్ చేసి మరీ.. హైదరాబాద్ లో వర్షం కురిపిస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం నీటమునిగింది. వందల కాలనీలు నీట మునిగాయి. ఇంతలో నగరంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయ్. ప్రస్తుతంలో నగరంలో వానలు దంచికొడుతున్నాయ్. అయితే ఈ వానలపై ఇప్పటికే ప్రభుత్వం, వాతావరణశాఖ ప్రజలని అలర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ హైఅలర్ట్ జారీ చేసింది.