హైదరాబాద్ కోసం మెగాస్టార్ ముందుపడ్డాడు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్దన్న పాత్ర పోషించాడు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలతో ముంచెత్తిన నేపథ్యంలో మెగాస్టార్ ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆయన దారిలో సినీ ప్రముఖులు కదులుతున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు తమవంతు సాయం చేశారు. టాలీవుడ్ నుంచి విరాళాల ప్రవాహం ఇప్పుడిప్పుడే మొదలైంది. అది ఇంకా కొనసాగనుంది.
కరోనా విజృంభిస్తున్న టైమ్ లోనూ మెగాస్టార్ పెద్దన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులని ఆదుకోవడానికి సిసిసి సంస్థని స్థాపించి.. దాని ద్వారా ఆదుకున్నారు. సినీ కార్మికులకి నిత్యవసర వస్తులని అందజేశారు. ఇప్పుడు హైదారాబాద్ ప్రజలకి సాయం చేసేందుకు కూడా మొదట మెగాస్టార్ నే ముందుకొచ్చారు. ఆయన దారిలో మిగితా స్టార్స్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మెగాస్టార్ ని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో కూడిన కథతో ఆచార్య రాబోతుంది. ఇందులో చిరు మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని చెబుతున్నారు. కరోనా లాక్డౌన్ ఆగిపోయిన ఆచార్య షూటింగ్ త్వరలోనే తిరిగి మొదలుకానుంది.