‘సోలో బ్రతుకే సో బెటర్’ సెన్సార్ రివ్యూ

సోలో బ్రతుకు గొప్పదనం గురించి ప్రేక్షకులకి చెప్పబోతున్నాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటాషా హీరోయిన్. బివిఎన్ ప్రసాద్ నిర్మాత. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుంది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది.

సినిమా చాలా ఎంటర్ టైనింగ్ ఉంది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. యూత్ ఫుల్ సినిమా అయినా చాలా నీట్ గా తీశాడట దర్శకుడు. అందుకే సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు పొందినట్టు చెబుతున్నారు. చిత్రలహరి సినిమా నుంచి తేజులో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆయన ఇదివరకటిలా ఫుల్లు ఎనర్జిటిక్ గా కాకుండా సెటిల్డ్ గా నటించారు. సోలో బతుకులోనూ తేజు నటన చాలా బాగుందని చెబుతున్నారు.

ఈ ఓటిటిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ వున్నాయి.  జీఫ్లెక్స్, జీటీవీ, జీఫైవ్ ల్లో ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేటుని ప్రకటించే ఛాన్స్ ఉంది. బహుశా… దీపావళీ కానుకగా సోలో బ్రతుకు ప్రేక్షకులకి ముందు రావొచ్చేమో.. !