హైదరాబాద్ వర్షాలు.. నరసింహన్ సాయం ఎంతంటే ?

భారీ వర్షాలు-వరదలతో హైదరాబాద్ లో అద్వాన పరిస్థితి నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. కష్ట సమయాన ప్రజలకి అండగా నిలుస్తున్నారు. తాజాగా మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కూడా తమవంతు సాయంగా రూ.25వేలు అందించారు.

హైదరాబాద్ నగరంతో నరసింహన్ మంచి అనుబంధం ఉంది. ఇక్కడ గవర్నర్ గా రికార్డ్ కాలం పని చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహాన్.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా పని చేశారు. నరసింహాన్ తో సీఎం కేసీఆర్ కు మంచి అనుబంధం ఉండేది. నరసింహాన్ స్థానంలో  తమిళసై తెలంగాణ గవర్నర్ గా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజా హైదరాబాద్ పరిస్తితిని చూసి  నరసింహాన్   ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ. పునరావాస కార్యక్రమాలను ఆయన అభినందించారు. పరిస్థితి త్వరగా కుదుట పడాలని ఆయన ఆకాంక్షించారు.