‘జీఎస్టీ 2’ రాబోతుంది !

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన శృంగార భరిత షార్ట్ ఫిల్మ్ “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” (జీఎస్టీ). రిలీజ్ ముందు, రిలీజ్ తర్వాత కూడా ఈ షార్ట్ ఫిల్మ్ పై మహిళా లోకం భగ్గుమంది. ఐతే, రిలీజ్ తర్వాత వర్మ ‘జీఎస్టీ’ని సపోర్ట్ చేసే ఓ ప్రత్యేక వర్గం ఏర్పడింది. దీనికి తోడు ప్రపంచ వ్యాపంతా వర్మ ‘జీఎస్టీ’ పాపులర్ అయిపోయింది. దీంతో పిచ్చ హ్యాపీగా ఉన్న వర్మ.. జీఎస్టీ సీక్వెల్ ని ప్రకటిచేశాడు.

‘పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూశాక జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు, నా జీఎస్టీ లవర్స్ నాతో ఉంటారని నమ్ముతున్నా’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది ‘జీఎస్టీ’ ప్రియులకు శుభవార్తే మరి.