నాయినిని పరామర్శించిన కేసీఆర్
అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్దిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. కేసీఆర్ వెళ్లిన సమయంలో నాయిని కొడుకు బోరుమన్నారు. ఆయన్ని కేసీఆర్ దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే మరికొద్దిసేపట్లో నాయిని గురించి విషాద వార్త వచ్చేలా ఉంది.
నాయిని ఉద్యమనేత. కేసీఆర్ తో కలిసి తెలంగాణకోసం కొట్లాడారు. ఉద్యమాలు చేశారు. జైలుకి వెళ్లారు. కార్మికలోకాన్ని ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర ఫోషించారు. అందుకే తెలంగాణ తొలి హోం మంత్రిగా నాయినిని నియమించారు సీఎం కేసీఆర్.
ఇక గత నెలలో కరోనా బారిపడిన నాయిని.. దాని నుంచి బాగానే కోలుకున్నారు. ఆ తర్వాతే ఆయనకి శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తాయ్. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు.