‘నా పేరు సూర్య.. నేను హాలీవుడ్ సినిమా కాపీని’.. !!

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “నా పేరు సూర్య” ‘నా ఇల్లు ఇండియా’ అనేది ట్యాగ్ లైన్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ అదిరిపోయింది. ఇప్పుడీ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు రిమేక్ అన్న ప్రచారం మొదలైంది. దానికి ప్రూఫ్’లు కూడా చూపిస్తున్నారు.

‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ (2002) అనే హాలీవుడ్ సినిమాను ఫైండింగ్‌ ఫిష్‌ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. డెంజిల్ వాషింగ్టన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయకుడు అమెరికా నేవీ అధికారిగా కనిపిస్తాడు. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య’ చిత్రం దగ్గరగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్పూర్తిగా తీసుకొని వక్కంతం కథని రాసుకొన్నాడా ? లేదంటే మొత్తానికి కాపీ పేస్ట్ చేశాడా ?? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్-త్రివిక్రమ్ ల మూవీ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ తేలిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కాపీ విషయంలో వచ్చిన వార్తలని దర్శకుడు త్రివిక్రమ్ ఖండించలేదు. దీంతో.. కాపీ నిజమేనని ఖరారైంది. ఇప్పుడు నా పేరు సూర్య విషయంలోనూ దర్శకుడు వక్కంతం వంశీ సైలైంట్ గా ఉంటే పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయి. సో.. కాపీ కాకపోతే ఖండించడమే బెటర్.