బాలరాజు.. మల్లిక నీరసంగా ఉందేంటీ ?
కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కార్తీకేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో కార్తీకేయ బస్తీ బాలరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. తాజాగా లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆమె మల్లిక పాత్రలో కనిపించనుంది.
మల్లిక లుక్ ని లావణ్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్’ అంటూ కాప్షన్ జత చేశారు. నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. మల్లిక చాలా నీరసంగా కనిపిస్తున్నారు. తీక్షణంగా ఆలోచిస్తున్నారు. బహుశా.. బస్తీ బాలరాజు గురించే ఆమె దిగులు పడుతున్నట్టుంది.