బిగ్ బాస్ : 8వ వారం ఎలిమినేషన్’లోకి వచ్చింది.. వీరే !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఏడు వారాలని పూర్తి చేసుకుంది. దసరా ఏపీసోడ్ గా ప్రసారమైన ఏడో ఆదివారం కలర్ ఫుల్లుగా సాగింది. స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరించారు. ఏకంగా 3 గంటల పాటు సాగిన ఏపీసోడ్ పసందైన వినోదాన్ని పంచింది. ఇక ఏడోవారం దివి ఎలిమినేట్ అయింది. సోమవారం ఎప్పటిలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది.

8వ వారానికి గానూ.. అమ్మ రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్‌, లాస్య, అఖిల్‌, మోనాల్ ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చేశారు. వీరిలో ఎవరు నామినేట్ అవుతారు అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.  ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాల్గో వారం స్వాతీ దీక్షిత్, అదోవారం సుజాత, ఆరోవారం కుమార్ సాయి, ఏడోవారం దివి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది చూడాలి.