‘ఆర్ఆర్ఆర్’ స్పూఫ్.. అదిరిపోయింది !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కొమరం బీమ్ జయంతి సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్ టీఆర్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ వీడియో రికార్డులు సృష్టిస్తోంది. మరోవైపు స్పూఫ్ లు క్యూ కడుతున్నాయ్. ఇందులో ఓ స్పూఫ్ వీడియోకు ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం సైతం ఫిదా అయింది.

ఆ వీడియోని ఆర్ ఆర్ ఆర్ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసారు. ‘కుర్రాళ్ళు చింపేశారు’ అని కామెంట్ పెట్టారు. చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తోన్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే యేడాది సమ్మర్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుందని చెబుతున్నారు.