టీఆర్ఎస్’పై బీజేపీ ఎటాక్
తెలంగాణ భాజాపా దాడికి సిద్ధమైంది. తెరాసపై పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేసినట్టుంది. త్రిముఖ వ్యూహాన్ని మలు చేసేలా కనిపిస్తోంది. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ భాజాపా సీరియస్ గా తీసుకుంది. ఈ దాడికి నిరసగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయ్ ఎబివిపి, బీజేవైఎం.
ఒక్క ప్రగతి భవన్ మాత్రమే కాదు.. తెలంగాణ భవన్ కూడా ముట్టడి లిస్టులో ఉన్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించారు పోలీసులు. అలానే తెలంగాణా భవన్ వద్ద కూడా పోలీసులు మొహరించారు. మరోవైపు బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష కొనసాగుతోంది. నిన్నటి దుబ్బాక ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొత్తానికి దుబ్బాక ఎన్నికల వేళ తెరాసపై భాజాపా ఎటాక్ చేస్తోంది. ఇది ఉప ఎన్నికకి మాత్రమే పరిమితం అవుతుందా? రాబోయే రోజుల్లోనే తెరాసపై భాజాపా దాడి కొనసాగుతుందా ? అన్నదిచూడాలి.