కేటీఆర్’పై విజయ్ దేవరకొండ ప్రశంసలు

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ (ఈవీ) పాలసీ విడుదల కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ. .సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పనితీరు అద్భుతంగా ఉంది. అద్భుతమైన పాలసీలతోరాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని కితాబిచ్చారు.

గతంలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. ముందు చూపుతో సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు విజయ్. 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం, సాగునీరు రావడం వల్ల రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారు. భూముల ధరలు కూడా పెరిగాయన్నారు.భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. వచ్చే జనవరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో హైదరాబాదీల లైఫ్ స్టైల్ మారబోతుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.