సోడా అమ్ముకుంటున్న యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు సోడా అమ్ముకుంటున్నారు. సోడా సెంటర్ పెట్టారు. దాని పేరు ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న సినిమా టైటిల్ ఇది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.  ఇందులో డెకరేషన్ లైట్స్‌, సోడా బాటిల్స్‌, మల్లె పూలతో కలర్ ఫుల్లుగా కనిపిస్తోంది.

ఈ మోషన్ పోస్టర్ ని షేర్ చేసిన సుధీర్ బాబు ‘మనోడు లైటింగ్ పెడితే ఊరంతా వెలిగిపోతుంది’ అని కామెంట్ పెట్టాడు. పల్లెటూరులో జరిగిన ప్రేమ కథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ‘వి’ సినిమా తర్వాత సుధీర్ బాబు చేస్తున్న చిత్రమిది. కరుణ కుమార్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. పలాస చిత్రంతో ఆయన ప్రతిభ చూశాం. ఈ సారి ఆయన సుధీర్ బాబు కళ్లలో వెలుగులు నింపేలా ఉన్నాడు.