కాజల్ పెళ్లి ఫోటోలు.. చూశారా ?
చందమామ కాజల్ ఇల్లాలిగా మారింది. శుక్రవారం రాత్రి ముంబయిలో కాజల్ పెళ్లి జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు, ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని, అన్ని రకాల జాగ్రత్తల మధ్య కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. కాజల్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత రెండేళ్లుగా కాజల్ పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. కాజల్ కూడా పెళ్లికి రెడీ. సరైనోడు గురించి వెతుకుతున్నానని పలు ఇంటర్వ్యూలో చెప్పింది. ఫైనల్ గా ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుతో పెళ్లికి రెడీ అయింది. పెళ్లి ఫిక్సయిందని చెప్పిన కాజల్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. నిశ్చితార్థం చేసుకుంది. కొద్ది గ్యాప్ తో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో కొనసాగనుంది. ఆచార్య, ఇండియన్-2, మోసగాళ్లు సినిమాలని కాజల్ పూర్తి చేయనుంది.