సర్దార్ జయంతి.. ప్రధాని నివాళి

భారతదేశపు ఉక్కు మనిషి, భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం ఉదయం నివాళులు అర్పించారు. సర్థార్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో సర్దార్ వల్లభ్ భాయి పటేల్  జన్మించారు.  స్వాతంత్య్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత సర్థార్ దే.