లక్ష్మీ (బాంబ్).. కొత్త పోస్టర్ !

అక్షయ్ కుమార్-కైరా అద్వానీ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం “లక్ష్మీ”. తెలుగు, తమిళ్ లోనూ సూపర్ హిట్టైన హారర్ కామెడీ సిరీస్ ‘కాంచన’ (ముని)కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలై ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 9న డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. కైరా అద్వానీ, ఆమె వెనకాల అక్షయ్ ఉన్న పోస్టర్ ఇది. ఇక  ఈ సినిమా టైటిల్ ని మార్చిన సమ్గతి తెలిసిందే. లక్ష్మీ బాంబ్ నుంచి బాంబ్ ని తీసేశారు. దీంతో ‘లక్ష్మీ’గా సినిమా రిలీజ్ కాబోతుంది.