ఉచిత కరోనా టీకాపై ఎన్నికల సంఘం కామెంట్

కరోనా టీకాని కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో వాడుకుంది భాజాపా. బీహార్ లో భాజాపా అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకానిఅందిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పేర్కొంది. అయితే ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఉచిత కరోనా టీకాపై ఎన్నికల సంఘం స్పందించింది. టీకా హామీలో ఎటువంటి ఉల్లంఘన లేదని ఈసీ పేర్కొన్నది. ప్రవర్తనా నియమావళి ప్రకారం అదేమీ అతిక్రమణ కాదు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని 8వ పార్ట్ ప్రకారమే ఎన్నికల హామీ ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.